- Details
- This Page Hits:9210
ధన్యులైన మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ గురించి కొన్ని వివరాలు
ఉగాది పర్వదినం అనేది భారత ప్రజల (ప్రత్యేకంగా దక్షిణ భారతీయుల) నూతన సంవత్సరారంభంగా జరుపుకునే పండుగ. చైత్ర మాసం లోని శుక్ల పక్ష పాడ్యమి తేదీన ఈ పండుగ జరుపుకుంటారు. ఉగాది పండుగ ప్రజలకు నూతన ఆశలు, ఆనందం మరియు ఉత్సాహం నింపుతుంది.
ఈ రోజున ప్రజలు ఇంటిని శుభ్రం చేసుకుని, పూజలు చేసి, మంగళహారతులు ఇచ్చుకుంటారు. ఉగాది పచ్చడి, జీలకర్ర బెల్లం, ఓళిగ, పంచభక్ష పరమానములు వంటి ప్రత్యేక వంటకాలు ఈ పండుగ సందర్భంగా తయారు చేస్తారు. ఉగాది పచ్చడిలో తీపి, ఉప్పు, చేదు, పులుపు మరియు వగరు వంటి షడ్రుచులను కలుపుతారు, ఇది జీవితంలో వివిధ రుచులను ప్రతీకిస్తుంది. ఉగాది రోజున ప్రజలు కొత్త బట్టలు ధరిస్తారు మరియు ఇంటి ముందు మామిడి ఆకులతో తోరణాలు కట్టుకుంటారు.
Information on Telugu New Year Ugadhi | Ugadi Festival
The text below is in Telugu, featuring a brief history about Ugadhi festival. Should you know anyone who speaks Telugu language, kindly share this link with them. Additionally, it's noteworthy that in various regions of India, the Ugadhi festival is celebrated as Gudi Padwa.
నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
తెలుగు సంవత్సరాలు 60 అని అందరికీ తెలుసు కానీ వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయనేది మాత్రం కొందరికే తెలుసు. అయితే వాటి వెనుక ఓ కథ ఉంది.
నారదమహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన పుత్రులతో యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు. అప్పుడు ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.
తెలుగు సంవత్సరాలు, ఆయనములు, ఋతువులు, మాసములు, తిధులు
తెలుగు సంవత్సరాల పేర్లు
1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12.బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.
సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజిస్తే అది ఆయనమవుతుంది....ఆయనములు 2:
Important Links To Visit
ఉత్తరాయణము
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినది మొదలు కర్కాటకరాశిలో ప్రవేశించువరకు గల కాలము 6నెలలు. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసాలలో కొంతబాగము, పుష్యం, మాఘ, ఫాల్గుణ మాసములలో ఉండును.
దక్షిణాయణం
కర్కాటకరాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు మకరరాశిలో ప్రవేశించు వరకు గల కాలము 6నెలలు. అవి ఆషాడ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక, మార్గశిర మాసములలో కొంత భాగము.
సంవత్సరాన్ని ఆరు భాగాలుగా విభజిస్తే అది ఋతువు అవుతుంది...అందుకే ఋతువులు ఆరు... వసంతం, గ్రీష్మం, వర్ష, శరదృతువు, హేమంత, శిశిరం.
సంవత్సరాన్ని పన్నెండు భాగాలుగా విభజిస్తే అది మాసం అవుతుంది...అందుకే మాసములు 12 :
చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాడం, శ్రావణ, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం
Links To Visit
పక్షములు 2
ప్రతి మాసమును కూడా రెండు పక్షాలుగా విభజించారు.. అవి
కృష్ణపక్షం (కృష్ణ అంటే నలుపు అని అర్థం) ఇది అమావాస్య పదిహేను రోజులకు గుర్తు...
శుక్ల పక్షం
పౌర్ణమి పదిహేను రోజులకు గుర్తు... పాడ్యమి నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షం
పౌర్ణమి మరునాటి పాడ్యమి నుండి అమావాస్య వరకు కృష్ణపక్షం.
ఒక్కో పక్షపు పదిహేను రోజులకు పదిహేను తిథులు ఉంటాయి.. అవి
పాడ్యమి, విదియ తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్ధశి,
పౌర్ణమి, అమావాస్య.
ఇక ఒక పక్షానికి రెండు వారములు.. ఒక వారమునకు ఏడు రోజులు...
వారములు 7
ఆదివారం - భానువాసరే
సోమవారం - ఇందువాసరే
మంగళవారం - భౌమ్యవాసరే
బుధవారం - సౌమ్యవాసరే
గురువారం - గురువాసరే
శుక్రవారం - భృగువాసరే
శనివారం - స్థిరవాసరే / మందవాసర
ఒక రోజుకు ఎనిమిది ఝాములు... ఒక ఝాముకు మూడు గంటలు.. ఒక గంటకు అరవై నిమిషములు.. ఇలా ప్రతి నిమిషమునకు వచ్చే నక్షత్రం తో సహా మన పంచాంగం చాలా నిర్దిష్టంగా నిఖ్ఖచ్చితంగా ఉంటుంది.. ఎంత ఖచ్చితత్వమంటే భారత యుద్ధం జరిగే సమయమున సూర్యగ్రహణాన్ని కూడా నమోదు చేయగలిగినంత... అందుకే మన హిందూ సాంప్రదాయాలు గొప్పవయ్యాయి.
ఇప్పుడు మనం పాటించే అర్థం పర్థం లేని జనవరి ఒకటి క్రొత్త సంవత్సరం కాదు... మనకు అసలైన నూతన సంవత్సరం.. ఉగాదే.. ఇప్పటినుండే మన వాతావరణంలో మార్పు మొదలవుతుంది... పంచాగం మొదలవుతుంది.. సృష్టి మొదలవుతుంది.. అందుకే ఇది యుగ ఆది అయింది.. అదే ఉగాది అయింది.. ఇంకా వివరంగా చెప్పాలంటే శిశిర ఋతువులో రాలి పోయిన ఆకుల స్థానంలో క్రొత్త చిగుళ్ళు ప్రారంభమయి.. క్రొత్త సృష్టి ప్రారంభమవుతుంది... అందుకే ఇది ప్రతి ఒక్కరిలో నూతనత్వానికి నాంది పలకి.. నిత్య నూతన ఆశలతో క్రొత్త సంవత్సరం ప్రారంభమవ్వాలని.. అందరికీ నూతనసంవత్సర శుభాకాంక్షలు.!
మన పురాణాలను గౌరవించి భగవంతుని ఆశీర్వచనాలను పొందండి.
మన పెద్దలను గౌరవించి భగవంతుని ఆశీర్వచనాలను పొందండి.
మన గురువులను గౌరవించి భగవంతుని ఆశీర్వచనాలను పొందండి.
మన దేశాన్ని గౌరవించి భగవంతుని ఆశీర్వచనాలను పొందండి.
ఇతరుల కష్టాన్ని అన్యాయంగా లేదా ఉచితంగా పొందాలని చూడటం మీకు కీడు చెయ్యగలదు. తత్కాలికమైన ప్రస్తుత లాభం కోసం ప్రయత్నించవద్దు, శాశ్వతమైన లాభం కావాలంటే సమాజానికి సేవ చెయ్యాలి.
గుర్తుంచుకోండి, పదిమంది ఆశీస్సులు మిమ్మల్ని అదృష్టవంతులని చేస్తాయి. మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అదృష్ట జాతకులవుతారు.
ఎందరో పెద్దలు, మహానుభావులు, మీ అందరికి నమస్కారములు తెలుపుకొంటూ
అన్ని విధాలా భగవంతుడు మీకు శుభం చేకూర్చాలని ప్రార్థిస్తూ, మీ సేవలో ఆనందాన్ని అనుభవిస్తూ
మీ ఆత్మీయ ఆత్మ మిత్రులు
శుభవాస్తు
తెలుగు ప్రజలందరికీ ఒక ఆనందకరమైన సమాచారం
తెలుగు భాషలో తయారైన వాస్తు శాస్త్ర వెబ్సైట్
మహాశ్రేష్టమైన యావత్తు తెలుగు జాతికి సగర్వంగా విన్నవించుకోవడం ఏమనగా తెలుగు భాషలో కూడా వాస్తు శాస్త్రము గురించి సంపూర్ణంగా తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాము. మీకు వీలైన సమయంలో ఒకసారి ఈ తెలుగు వాస్తు వెబ్సైటు ను వీక్షించగలరు. తెలుగు భాషలో వాస్తు వెబ్సైట్
వాస్తు శాస్త్ర ప్రశ్నలు మరియు సమాధానాలు
- ఉచిత వాస్తు సలహాల గురించి తెలపండి?
- వాస్తు శాస్త్రంలో వీధి పోట్లు అంటే ఏమిటి?
- ఉచిత వాస్తు సేవల గురించి తెలియచేయండి?
- గృహవాస్తు విషయాల గురించి తెలియచేయండి?
- తెలుగులో గృహ వాస్తు సంపూర్ణసమాచారం ఎక్కడ లభిస్తుంది?
- పడక గదుల వాస్తు గురించి చెప్పండి, ఏ పడకగది ఎక్కడ ఉండాలి?
- వాస్తు శాస్త్ర ఫలితాల గురించి తెలుసుకోవాలని భావిస్తున్నాను, లింకుని చూపండి?
- వాస్తు శాస్త్రం గురించి తెలుసుకోవాలని వుంది, దీనికి సంబంచిన లింక్ ను తెలుపగలరు?
Vastu Testimonials Delivered By Respected Residents
Dear Suresh, I am pleased to inform you that like the way you provided consultation for my home and explained to me all the changes required inside and outside home. I really appreciate the diagrams that you prepared for my home with pictures and arrows showing the changes need to be done. Above all, you explained very well the reasons behind changes you recommended for my home with great clarity and sense of humor. No doubt in my mind, you are the best Vastu expert, I really appreciate your dedication by building and maintaining a very informative website that is helping thousands of people across the globe. Also, I sensed when I talk to you and when I was dealing with you, you follow honesty and integrity and you have a sincere desire to help others - Kotesware Rao - Dallas - USA
We are tech professionals and working in USA. After a year long search we brought the house. After buying the house I started looking for consultant who can help me evaluating the house. I came across Subhavaastu website which has lot of information. I contacted Mr.Suresh and requested him to help with our house vastu. It has been an incredible delight working with him.. He is very detailed oriented person and never compromises with his work. I am typically not interested to deliver the reviews. But after working with Mr. Suresh I decided to share my experience. Mr. Suresh has great expertise in providing vastu consultation to USA property. He is always available through email and phone l to answer questions. I am writing this review hoping it will help other people like me who lives in abroad. Please take advise before buying the house. I highly recommend Mr. Suresh as he has great experience with structure of USA properties and also he provides genuine consultation. I really appreciate Mr. Suresh's help in evaluating our house - Padma - Boston - USA
"I contacted Sureshji to consult on our current home. He was spot on in identifying vastu dosha in regards to the problems we were having. He suggested remedies but we are still looking for a new house. Since then I have been in touch with him for finding a right home for us. He is very sincere and truly wishes better lives for everyone. He doesn’t compromise with quality and is always responsive to queries. He recommends solutions as per location as Vastu rules differ for each country. He is greatly contributing to the society with his knowledge of Vastu and dedication towards his work. Keep up the good work Sureshji and wish you success and happiness!" - Megha - Virginia - USA
I have consulted Suresh Garu during December 2014 during the process of buying a house in Texas, USA. I have occupied the house for one year now, and feel like dropping a review regarding my experience during the entire process. I am very much satisfied with the kind of service I received from him. He is very knowledgeable and I was often stunned by his detailed analysis during the course of my interaction with him. He was very much accessible over phone (perhaps more than 10 times for one house plan!) and the price is very much reasonable especially compared with the cost of the house. I noticed his burning desire to help me in making informed decisions on certain things. I have seen some people pretending to know this subject and misguiding those who come for help by saying only what we want to hear. SubhaVaastu is definitely not that one. Finally, I am strong believer of leaving certain things to experts in those subjects. I have been in US for more than 13 years and have seen people doing their own corrections (by reading website articles) trying to save few dollars. Please don’t do that. You would end up in causing more damage. I highly recommend you to engage SubhaVaastu in your next project - Satish - Dallas - TX - USA
Announcement
Delayed Marriages
Exploring Vastu Factors Behind Delayed Marriages.. An investigative study focusing on "The Impact of Vastu on Delayed Marriages" and exploring "Vastu Factors Contributing to Infertility Issues".
Vastu Questions
A comprehensive range of Vastu queries have been addressed here.100 Vastu Questions & Answers
Free Vastu Services
Who are eligible for Free Vastu Services, check this page.
Inspirational Quotations
"The world is the great gymnasium where we come to make ourselves strong." — Swami Vivekananda
“Great Personalities speak about thoughts. 'Average Person' talk about occassions. 'Narrow Minded' gossip about others.” ― Eleanor Roosevelt . . . Let you question yourself, "Who You Are, either 'Great Personality', 'Average Person' or 'Narrow Minded' ?
Joke Of the Day
Rajesh: Chintu, what would you do if you accidentally stepped on an elderly man's foot?
Chintu: I’d apologize, Dad.
Rajesh: That’s wonderful, son. You’ve made me proud. Now, what if he appreciates your politeness and offers you a chocolate?
Chintu: I’d step on his other foot immediately, Dad!
Vastu Tip of the Day
Follow us on Social Media
Follow us on WhatsApp
We introduced WhatsApp Channel from 16th November 2024. Here is the link - SubhaVastu Whatsapp Channel